/rtv/media/media_files/2025/03/21/jc8tjfWQXadyxfbMeMZG.jpg)
subbayya gari hotel in kondapur gachibowli
సుబ్బయ్య గారి హోటల్‌లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్‌లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి.. అనేంతలా ఈ హోటల్ పాపులర్ అయింది. ముఖ్యంగా కాకినాడలో సుబ్బయ్య హోటల్‌కి చాలా క్రేజ్. అది ఇప్పుడు హైదరాబాద్ వరకూ విస్తరిచింది.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు రాష్ట్రాల్లో నోరూరించే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే.. అది సుబ్బయ్య గారి భోజనమే అని చెప్తారు. కాకినాడలో ప్రారంభమైన ఈ హోటల్.. ఇప్పుడు వైజాగ్, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో విస్తరించింది. ఈ హోటల్‌లో వెజ్ మీల్స్‌కి భోజన ప్రియులు పడిచచ్చిపోతారు. అంతటి టేస్ట్ ఉంటుంది మరి. నోరూరించే రుచి, ఆకలి తీర్చే క్వాంటిటి వల్ల ఈ హోటల్ బాగా ఫేమస్ అయింది.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
సుబ్బయ్య హోటల్‌కు షాక్
ఈ హోటల్‌లో ఒక్కసారి భోజనం చేశారంటే.. మళ్లీ మళ్లీ అక్కడకే వెళ్లాలి అనేంతలా ఉంటుంది. ఆహా ఇదేం భోజనం రా బాబు.. ఎంత తిన్నా తినాలనే అనిపిస్తుంది అని అంటారు. అలాంటి హోటల్ ఇప్పుడు దారుణంగా తయారైనట్లు అధికారుల తనిఖీలో బయటపడింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సంచలన విజువల్స్ బయటపడ్డాయి.
Task force team has conducted inspections in Gachibowli area on 20.03.2025.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) March 21, 2025
𝗦𝘂𝗯𝗯𝗮𝘆𝘆𝗮 𝗚𝗮𝗿𝗶 𝗛𝗼𝘁𝗲𝗹, 𝗞𝗼𝗻𝗱𝗮𝗽𝘂𝗿, 𝗚𝗮𝗰𝗵𝗶𝗯𝗼𝘄𝗹𝗶 𝗥𝗼𝗮𝗱
* FSSAI License not displayed in the premises.
* Kitchen area found to be very unhygienic.
* Flooring found to… pic.twitter.com/MdB3B7sMRV
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌తో పాటు డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కుల్లిపోయిన కూరగాయలు, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్ యాజమాన్యం లైసెన్స్ కూడా డిస్‌ప్లే చేయనట్లు గుర్తించారు. అలాగే హోటల్ స్టాఫ్ సైతం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ ధరించలేదని తెలిపారు. దీంతో ఆ హోటల్‌లో పరిశుభ్రత లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
వంటగది ప్రాంతం చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే ఫ్లోరింగ్ అస్తవ్యస్తంగా, విరిగిపోయినట్లు కనిపించింది. గోడలు సైతం అపరిశుభ్రంగా.. ఎగ్జాస్ట్ నుండి నూనె కారుతున్నట్లు గుర్తించారు. స్టోర్ రూమ్ సైతం చిందరవందరగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.