/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
suryapet crime
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగిన ప్రభుత్వ టిచర్ సిగరెట్ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. మత్తులో ఉన్న అతను దాన్ని ఆర్పివేయకుండా అలాగే నిద్రలోకి జారుకొన్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి చిటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై ఎస్సై అనిల్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళితండాకు చెందిన ధారావత్ బాలాజీ(52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నారు.
Also Read : సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Also Read : బాలీవుడ్‌లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ
ప్రాణం తీసిన సిగరెట్..
ఆదివారం శ్రీరామ నవమి పండగ కావడంతో భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లారు. సింగిల్‌గా ఉన్న ఉపాధ్యాయుడు బాలాజీ మద్యం తాగి సిగరెట్ తాగుతూ ఇంటి వరండాలోని మంచంపై పడుకున్నారు. అలాగే కొద్దీసేపటి నిద్రలోకి జారుకోగా.. సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. మరో పక్క కూలర్ గాలి తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇంటి చుట్టు పక్కన ఎవరూ లేకపోవడం, బాలాజీ మత్తులో ఉండటంతో మంటలు అంటుకుని సజీవ దహనమయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!
Also Read : ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!
(ts-crime-news | latest-telugu-news | today-news-in-telugu | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | government-teachers)
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.
anvesh sensational comments on bigg boss contestants
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.
Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
ఉగ్రదాడికి వీరే కారణం
అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే.
Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.
Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!
అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news
Chanakya: చాణక్య నీతి..ఇలాంటి వారికి ఎంత చెప్పినా జన్మలో మారరు
CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
🔴Live News Updates: ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!
Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?