తెలంగాణ (Telangana) లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. తగిన సమయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు న్యాయవాది.
Also Read : సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్
సుప్రీంకోర్టు అసహనం
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్, ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అంటూ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు తీరేవరకా అంటూ మండిపడింది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
దీంతో స్పీకర్ నిర్ణయం తర్వాత డెసిషన్ చెప్తామని ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని కోర్టుకు చెప్పండని రోహత్కికి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ వారం రోజులు పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాగా 2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.
Also Read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో..!
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!