/rtv/media/media_files/2025/02/24/7vEhmeLiyXQbFchsUdxR.jpg)
SLBC tunnel 123 Photograph: (SLBC tunnel 123)
SLBC: నాగర్ కర్నూల్ SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి NDRF ప్రయత్నిస్తోంది. 200 మీటర్ల వరకు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే ఆ 8మంది బతికే ఛాన్స్ ఉందంటున్నారు.
ఆ 8 మంది బతికే అవకాశాలు లేనట్లేనా? NDRF బృందం షాకింగ్ రియాక్షన్.!#SLBCTunnelCollapse #NDRF #NewsUpdate #RTV pic.twitter.com/U9KuzaWHAA
— RTV (@RTVnewsnetwork) February 24, 2025
2 కిలోమీటర్లు కాలినడకనే..
ఈ మేరకు శనివారం సాయంత్ర నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్‌లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. మేము పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం రాత్రి 10 గంటలకు టన్నెల్ లోపలికెళ్లాం. లోకోమోటివ్స్ ద్వారా 11 కిలోమీటర్లు వెళ్లాక.. ఆ తర్వాత 2 కిలోమీటర్ల వరకు కాలినడక వెళ్లాం. టన్నెల్ బోరింగ్ మెషీన్ వద్దకు చేరుకున్నాక.. కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాం. 200 మీటర్ల వరకు మట్టి కూరుకుపోవడంతో అవతలివైపు నుంచి మాకు సమాధానం రాలేదు. ఆ డెబ్రిస్‌ని తొలగిస్తే గానీ కార్మికులు ఎక్కడ చిక్కుకున్నారో, ఎలా కాపాడాలో తెలుసుకోలేం. 11-13 కిలోమీటర్ల మధ్య ప్యాచ్‌లలో నీళ్లు నిండిపోయాయి. ముందుగా దాన్ని తొలగించాలి. ఆ నీటిని పూర్తి స్థాయిలో తొలగిస్తే గానీ డెబ్రిస్‌ని తొలగించే పనిని ప్రారంభించలేమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు వివరించారు.
SLBC Tunnel Collapse Update:
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 23, 2025
మేము పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం రాత్రి 10 గంటలకు టన్నెల్ లోపలికెళ్లాం
లోకోమోటివ్స్ ద్వారా 11 కిలోమీటర్లు వెళ్లాక.. ఆ తర్వాత 2 కిలోమీటర్ల వరకు కాలినడక వెళ్లాం
టన్నెల్ బోరింగ్ మెషీన్ వద్దకు చేరుకున్నాక.. కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి… pic.twitter.com/SBLJllHjVT
ఇది కూడా చదవండి: Hit 3 Teaser: అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. నాని ‘హిట్ 3’ టీజర్ అదుర్స్!
ఈ టన్నెల్ లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోగా వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వారి ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రా రెస్క్యూ టీమ్స్ సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ను రప్పించి పరీశీలించగా టన్నెల్ బోరింగ్ మెషిన్‌లో400 మీటర్ల వరకు మట్టి, ఐరన్ షీట్లు కూరుకుపోయినట్లు గుర్తించారు. టన్నెల్‌లో 2.5 మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, సొరంగంలో భారీగా ఊటనీరు ఉబికివస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3500 లీటర్ల ఊటగా వస్తుందని, దీంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: AP News: మంచం కింద నక్కి నక్కి.. వ్యభిచార గృహంలో వైసీపీ నేత రాసలీలలు!