/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. పైకప్పు పడిపోతున్నప్పుడు కొంతమంది కార్మికులు బయటకు వచ్చేశారు. కానీ ఎనిమిది మంది మాత్రం అందులో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందం నిన్నటి నుంచీ కష్టపడుతోంది.
ఎంత ప్రయత్నించినా అవడం లేదు..
అయితే నిన్నటి నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కార్మికులను బయటకు తీసుకురావడం అవడం లేదు. మరోవైపు టన్నెల్ లో చిక్కుకున్న వారికి సరిగ్గా ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియడం లేదు. వారు ఎలా ఉన్నారో కూడా తెలియడం లేదు. పోనీ బయట ఉన్నవాళ్ళఉ లోపలికి వెళదామంటే మోకాళ్ల లోతు మట్టి, బురదతో కెనాల్ అంతా నిండిపోయింది. ఇలాంటి స్టేజ్ లో లోపలికి వెళ్ళలేమని ఎస్డీఆర్ఎఫ్ బృందం తేల్చి చెప్పేసింది. లోపల ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పింది.
#WATCH | Nagarkurnool, Telangana: SDRF, NDRF and other rescue teams, along with officials from Singareni Collieries, return after inspecting the collapsed portion of the Srisailam Left Bank Canal (SLBC) tunnel, in which at least eight workers are feared trapped. pic.twitter.com/qun7EZWPc9
— ANI (@ANI) February 22, 2025
నిన్న ఉదయం తొమ్మిది గంటలకు టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ దగ్గర సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషిన్ తో పనులు చేస్తుండగా...ఒక్కసారిగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్ లో 50 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఇంజనీర్లు, కార్మికులు అందరూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అందులో నుంచి 42 మంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. కానీ ఎనిమిది మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు.
శ్రీశైలం కెనాల్ టన్నెల్ పని ఐదేళ్ల క్రితం నిలిచిపోయింది. మళ్ళీ నాలుగు రోజుల క్రితమే దీని పనులు ప్రారంభమయ్యాయి. టన్నెల బోర్ డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మట్టి రాలడం, సీపేజ్ అవడం మొదలైంది. ఇది గమనించిన బోరింగ్ ఆపరేటర్ అందరినీ అలెర్ట్ చేశారు. అయితే వాళ్ళఉ రియలైజ్ అయి..బయటకు వచ్చేలోపునే ఇంతకు ముందు వేసిన కాంక్రీట్స్లాబ్ సహా మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఆ ప్రాంతమంతా రాళ్లు, మట్టి, బుదరతో నిండిపోయింది.
Also Read: Champions Trophy: ఈరోజు మ్యాచ్ లో కోహ్లీ, పంత్ ఆడతారా?