SRH vs RCB Match: ఉప్పల్‌లో చివరి మ్యాచ్‌.. బ్లాక్‌లో టికెట్ల దందా.. రూ.లక్షకు ఒక టికెట్

ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హెదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.  ఉప్పల్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో బ్లాక్ టికెట్ల మాఫియా నడుస్తోంది.

New Update
SRH vs RCB Match

SRH vs RCB Match

ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హెదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.  ఉప్పల్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో బ్లాక్ టికెట్ల మాఫియా నడుస్తోంది. స్టేడియంకు దగ్గర్లో బ్లాక్‌టికెట్లు అమ్ముతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఫ్యాన్స్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. వివిధ వెబ్‌సైట్లలో టికెట్లను విక్రయిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యికి పైగా ఉండే టికెట్‌ను రూ.10 వేలకు, రూ.10 వేల టికెట్‌ను రూ.లక్షకు అమ్మతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇక కార్పొరేట్ బాక్స్‌ రూ.30 లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఐదుగురు మృతి!

మ్యాచ్ టికెట్ల అమ్మకం మొదలుపెట్టిన నిమిషాల్లోనే అన్ని అమ్ముడైపోయాయి. నిమిషాల్లోనే ఏకంగా 39 వేల టికెట్లు బుక్ అయ్యాయి. అయితే ఎన్ని టికెట్లు అమ్మారనేదానిపై SRH యాజమాన్యం ఇంకా వివరాలు వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా టికెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌లో ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: మండుతున్న ఎండలు.. వడదెబ్బతో 22 మంది మృతి

Advertisment
తాజా కథనాలు