/rtv/media/media_files/2025/02/19/juubLwody10i7mPP2yaN.jpg)
kamareddy
ఛావా సినిమా (Chhaava Movie) ..ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకంగా నిలిచిన సినిమా. అటు మూవీ లవర్స్ (Movie Lovers) తో పాటు ముఖ్యంగా మరాఠాలకు బాగా కనెక్ట్ అయిన చిత్రం. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండానే రిలీజ్ అయిపోతుంటాయ్. థియేటర్లో బొమ్మ పడ్డాకే.. దాని వెయిట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు టాకీస్‌లో నడుస్తున్న ఛావా కూడా అలాంటిదే! మూవీ టాక్.. ముందు టాకీస్ దాటింది. తర్వాత స్టేట్ బోర్డర్స్ దాటింది. సోషల్ మీడియాలో అయితే.. ఇంటర్నెట్ బారియర్స్‌ని బద్దలుకొట్టి.. ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రని అందరికీ తెలిసేలా చేస్తోంది.
Also Read:Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న!
ఒకానొక సమయంలో దేవుడి సినిమాలు, దేశభక్తికి సంబంధించిన సినిమాలు రిలీజైనప్పుడు.. ఇలాంటి సీన్లు థియేటర్లలో కనిపిస్తూ ఉంటాయ్. తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసులాంటి సినిమాలు వచ్చినప్పుడు.. అంతా థియేటర్లకు క్యూ కట్టారు. దేవుళ్లకు, సినిమా పోస్టర్లకు పూజలు చేశారు. ఆ మధ్య వచ్చిన.. ఉరి సినిమాకు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించింది. హౌ ఈజ్ ద జోష్ అనే స్లోగన్.. ఇండియా మొత్తం రీసౌండ్‌లో వినిపించింది. కానీ.. ఓ పీరియాడికల్ డ్రామాకు.. జనం నుంచి ఇంత స్పందన, ఈ రకమైన ఎమోషనల్ రియాక్షన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. ఇప్పుడదే జరుగుతోంది. చరిత్ర సృష్టించి.. చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
Also Read: Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Kamareddy-Chhaava Movie Special Show
Telengana: Special screening of #Chhaava for the students of Kamareddy Shishu Mandir School!
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 19, 2025
A glimpse into the valor and legacy of Chhatrapati Sambhaji Maharaj, inspiring the next generation.
Jai Bhavani, Jai Shivaji! 🚩 pic.twitter.com/MEKLsGk3Me
ఛావా సినిమా.. చాలా మందికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. మూవీ టాక్ విన్నాక.. థియేటర్లలో ఆడియెన్స్ ఎమోషనల్ రియాక్షన్స్ చూశాక.. అంతా తీరిక చేసుకొని మరీ.. సినిమాకు వెళ్తున్నారు. కనెక్ట్ అవుతున్నారు. అక్కడే ఏడ్చేస్తున్నారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ చరిత్రని తెరపై చూస్తూ.. పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఛావా కేవలం హిందీలోనే రిలీజైంది. అయినప్పటికీ.. అన్ని భాషల వాళ్లు చూడాలని కోరుతున్నారు.
శంభాజీ మహరాజ్‌ని.. కేవలం ఓ మరాఠా ఛత్రపతిగా కన్నా.. హిందూ రాజుగా, సనాతన ధర్మ రక్షణకై పోరాడిన యోధుడిగా చూడాలంటున్నారు. ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని నిలబెట్టిన వీరుడిగా చూడాలంటున్నారు. మతోన్మాది ఔరంగజేబుకు ఎదురొడ్డి నిలబడి.. మొఘలుల గుండెల్లో శివాజీ నాటిన భయాన్ని.. కొన్నేళ్ల పాటు అలాగే ఉంచిన ధీరుడిగా చూడాలంటున్నారు.
Also Read: Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన మంత్రి లోకేష్
ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన చూశాక.. ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో కనెక్ట్ అవుతున్నారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు.. క్లైమాక్స్‌లో భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసివాళ్లంతా.. శభాష్ అంటున్నారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని.. అభిమానులు, మరాఠా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే కామారెడ్డి (Kamareddy) శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల కోసం ఛావా సినిమాని ప్రత్యేక షో ప్రదర్శించారు. సినిమా థియేటర్ లో విద్యార్థులు శివాజీ గురించి పాడుతున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పరాక్రమం, వారసత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఎంతో ముఖ్యమని అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ఈ సినిమా తరువాత తరానికి స్ఫూర్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు.