/rtv/media/media_files/2025/04/04/sLhj3SJb5yYnaOeSr0Hc.jpg)
Elevated corridor
Elevated corridor : ఉప్పల్ నుంచి వరంగల్వెళ్లే రూట్ లో ట్రాఫిక్సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్‌చేసిన ఎలివేటెడ్కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. శంకుస్థాపన చేసి నాలుగేండ్లు అవుతున్నా ఇప్పటివరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒకడుగు ముందుకు పడితే.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ట్రాఫిక్సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత ట్రాఫిక్‌ను సృష్టిస్తున్నాయి. ఫ్లైఓవర్పనుల కోసం ఎక్కడికక్కడ తవ్విపోసిన మట్టి, రోడ్లపై గుంతలు, వెహికల్స్వెళ్లే టైంలో రేగుతున్న దుమ్ముతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్అవుతోంది.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
దీంతో ఆగ్రహించిన స్థానికులు ఈ రోజు అందోళనకు దిగారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వద్దకు చేరుకున్న స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.7ఏళ్లుగా ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు వారు తెలిపారు. స్థానికులు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాఫిక్‌తో పాటు, ప్రమాదాల బారిన పడుతున్నామంటూ స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.76 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా, 2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. నాలుగేండ్లలో పిల్లర్లు వరకు మాత్రమే పూర్తిచేశారు. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.148 పిల్లర్లలో128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటివరకు స్లాబు వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము రేగుతోంది.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
రామంతాపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైను పైనుంచి నిర్మించాల్సి ఉంది. అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీలు, ఇతర మెటీరియల్ ఖర్చు పెరిగింది. దీంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. అలాగే కారిడార్‌కు ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీసు రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు భూమి ఇచ్చినవారికి నష్ట పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు. పరిహారాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరగా భూసేరణ చేసి కేంద్రానికి రిపోర్టు ఇవ్వడంలో తాత్సారం చేస్తుందని నిర్వాసితులు చెబుతున్నారు. అలాగే నష్టపరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం కూడా లేటుకు కారణమైంది. మొత్తంగా భూసేకరణ పూర్తయితే గానీ పనుల్లో వేగం పెరగదని అధికారులు చెబుతున్నారు.
Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
Minister Seethakka : సోషల్‌మీడియా నన్ను మానసికంగా దెబ్బతీసింది..మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డాను.నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా,చాలా ధైర్యం కోల్పోయానని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి...కానీ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేయద్దని అన్నారు.
Minister Seethakka
Minister Seethakka : సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డాను.నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా,చాలా ధైర్యం కోల్పోయానని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీతక్క ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి...కానీ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం ఏంటి ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేయకూడదని, సోషల్ మీడియాకి హద్దు ఉండాలన్నారు. సోషల్ మీడియా సిన్సియర్ గా వర్క్ చేసే మహిళల ధైర్యాన్ని దెబ్బతీస్తుందని సీతక్క అభిప్రాయపడ్డారు.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!
Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
సోషల్ సర్వీస్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయాలి కానీ బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్‌ఎస్ సీతక్క అన్నారు.అబద్ధాన్ని వంద సార్లు చెపితే నిజం అవుతుందని బీఆర్‌ఎస్ నమ్ముతుందన్నారు. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్, బీజేపీ అన్నదమ్ములని సీతక్క విమర్శించారు. ఒక మంచి పని చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే దాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకుని మరొక పది మంది బయట వచ్చి సహాయం చేసే లాగా ఉండాలని ఆమె సూచించారు. అంతేకానీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీయరాదని అన్నారు.సోషల్ మీడియా కట్టడికి ఒక చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ అని ఒక వ్యక్తిని గురించి అన్న విషయం కాదని ఒక పార్టీ ని మాత్రమే అన్నారని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
Also Read: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Elevated corridor : కొనసా.......గుతున్న ఉప్పల్ఎలివేటెడ్ కారిడార్..... స్థానికుల ఆందోళన.
ఉప్పల్ నుంచి వరంగల్ రూట్ లో స్టార్ట్‌చేసిన ఎలివేటెడ్కారిడార్ పనుల్లో జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Telangana: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వాళ్లకి జెన్కో ఉద్యోగాలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్కో ఉద్యోగాలు కల్పించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Bird Flu: రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..17 వేల కోళ్లు పూడ్చివేత
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీని వణికించిన బర్డ్ ప్లూ ఇప్పుడు తెలంగాణలోనూ తన ప్రభావాన్నిచూపుతోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
Duvvada: ఏ క్షణమైనా నా రాజాను చంపేస్తారు.. అందుకే కరెంట్ కట్ చేసారు: మాధురి సంచలనం!
ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Golden silk saree : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..ప్రత్యేకతలివి
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు.Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
Weight Loss: ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే నాజూకు నడుము!
Aghori: వాడు అఘోరి కాదు అమ్మాయిల పిచ్చోడు.. ప్రతిరోజు రక్తంతో అభిషేకం చేసి! (వీడియో)
PM Modi Bangkok Tour | బ్యాంకాక్‌లో మోదీ గ్రాండ్ ఎంట్రీ | Thailand | BIMSTEC Summit | RTV
ఇకనుండి తనతో ఎలాంటి సంబంధం లేదు.. | Aghori - Sri Varshini BreakUp | RTV
శ్రీవర్షిణితో అఘోరి బ్రేకప్.!! | Lady Aghori Shocking Comments On Sri Varshini | RTV