/rtv/media/media_files/2025/02/28/QO2mtw6bCGv35cYSbnnq.jpg)
SLBC Tunnel Rescue
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన సంఘటనలో కార్మికుల కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు రోజులుగా కార్మికులు అందులోనే చిక్కుకుపోయి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంత దూరం వెళ్ళినా మట్టి, బురద తప్ప ఏమీ కనిపించకపోవడం నిరాశనే మిగులుస్తున్నా..కార్మికులను వెతకడానికి ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీని కోసం బహుముఖ వ్యూహం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్నంతా నిపుణులు వేగంగా పని చేశారు. మరింత లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. దాంతో పాటూ టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కత్తిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో వేగం పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను సైతం వాడాలని డిసైడ్ అయ్యారు.
టీబీఎంను కట్ చేస్తున్న నిపుణులు..
టీబీఎం మొత్తం 140 మీటర్ల పొడవుంది. అందులో టీబీఎం ఒక్కటే 1,500 టన్నుల బరువుతో... రెండు ప్లాట్‌ఫాంలుగా 120 మీటర్ల పొడవుంది. ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద, మట్టి, రాళ్లు పేరుకున్నాయి. వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు. మరోవైపు సొరంగంలో దిబ్బలుగా పేరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. అలాగే నీటిని సైతం బయటకు తోడేస్తున్నారు. బీఆర్‌వో, నేవీ, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, వివిధ ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వీరికి తోడు రైల్వేశాఖ సైతం ఒక బృందాన్ని పంపించింది.
అయితే టీబీఎంను కట్ చేయడం, మట్టి, బురదను బయటకు పంపించడం చాలా కష్టమవుతోంది. బురద, రాళ్లు, పైపులు, ఇనుప సామగ్రిని లోకో రైల్ వ్యాగన్లలో నింపి బయటకి పంపుతున్నారు. కన్వేయర్ బెల్ట్ బెల్టుపై తరలిస్తే అది తెగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో తొలగించిన వ్యర్ధాలను లోకో రైల్ వరకు చేతులతో మోసుకు వెళుతున్నారు. దీనికోసం అదనపు కార్మికులు అవసరం అని భావిస్తున్నారు. అందుకోసం సింగరేణి కార్మికులను పిలిపించాలని భావిస్తున్నారు. మరోవైపు హైడ్రా సిబ్బందిని సైతం రంగంలోకి దింపనున్నారు.
రోజుకు రెండుసార్లు సమీక్ష
సొరంగంలో జరుగుతున్న పనులపై నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రోజుకు రెండుసార్లు సమీక్షిస్తున్నారు. బాధితులను ఎలా అయినా బయటకు తీసుకురావాలని..కొత్త మార్గాలను అన్వేషించాలని...ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని చెప్పారు. సొరంగం పక్క నుంచి మరో మార్గం తవ్వే అంశాన్ని కూడా పరిశీలించాలని ఉత్తమ్ చెప్పారు. అయితే అలా చేస్తే భూమి పొరలు వదులు కారణంగా ప్రమాదం జరిగిన చోట మరోసారి పైకప్పు కూలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
Also Read: TN: క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నాలను విచారణ