/rtv/media/media_files/2025/02/26/DA3VHZbm5P42qRiB8EYf.jpeg)
SLBC
SLBC టన్నెల్‌లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ రోజురోజుకు కష్టంగా మారుతుంది. ఎప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నీటి ఊట వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 7 మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. GPR టెక్నాలజీ ఫెయిల్ కావడంతో గందరగోళం ఏర్పడుతుంది. అవసరమైతే రోబోలు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని..
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా టన్నెల్ వద్దకు వెళ్లారు.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తొమ్మిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్‌ను వద్దకు వెళ్లారు. అయితే టన్నెల్‌లో ఉన్నవారంతా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసి నాలుగు మృత దేహాలను గుర్తించారు. వాటిని తీసి సొంత గ్రామాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన నాలుగు మృత దేహాలు తీయడం కష్టమని ఎన్టీఆర్ బృందాలు చెబుతున్నాయి.