/rtv/media/media_files/2026/04/04/singareni-2026-04-04-21-42-40.jpg)
Singareni Bonanza, Free 10 Lakh Natural Death Insurance for Workers in Tie-up with Union Bank
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు, అధికారులకు యూనియన్ బ్యాంక్ నుంచి రూ.కోటి ప్రమాద బీమా వస్తోంది.
అయితే సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు కేవలం ప్రమాదాలు మాత్రమే కాకుండా సహజ మరణం పొందినవాళ్లకి కూడా రూ.10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని అందించాలని యూనియన్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది.
Also Read: బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సింగరేణి CMD డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు ఈ బీమా ఒప్పందం సాధ్యమయ్యింది. సాధారణంగా బయట ఉండే ఇన్సూరెన్స్ కంపెనీలల్లో రూ.10 లక్షల బీమా పాలసీ కావాలంటే ఏడాదికి కనీసం రూ.5 వేలకు పైగా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కానీ సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల అక్కడి కార్మికులు ఒక్క రూపాయి చెల్లించకుండానే ఈ ఉచిత బీమా సౌకర్యం లభించనుంది.
ఇతర బ్యాంకులతో సంప్రదింపులు
ప్రస్తుతానికి యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో.. సింగరేణి సంస్థలో రూ. కోటి ప్రమాద బీమాను అందిస్తున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే రూట్‌లో వెళ్లేలా యాజమాన్యం సూచిస్తోంది. సహజ మరణానికి సైతం బీమా వర్తింపజేసేలా మిగిలిన బ్యాంకులతో అధికారులు చర్చిస్తున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగనుంది.
Follow Us