Rajasingh : రాజాసింగ్‌కు షాక్‌.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌

ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

New Update
Rajasingh

Rajasingh

Rajasingh: ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం.. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం... అందుకే ఆయనకు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయనకు సంబంధించిన రెండు ఫేస్ బుక్ పేజీలు, మూడు ఇన్ స్టా అకౌంట్లను తొలిగిస్తూ మెటా నిర్ణయం తీసుకుంది.

Also Read :  మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!

బీజేపీలో వివాదస్పద నేతగా పేరున్న రాజాసింగ్ హిందూ దేవాలయాలు, దేవుళ్ల పేరుతో సభలు, సమావేశాల్లో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తాడని పేరుంది. సోషల్ మీడియాలోనూ ఇతర వర్గాల పట్ల తనకున్న ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటాడు. అనేక సందర్భాల్లోనూ ఇతర మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు ఆయన పై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. బీజేపీ లోనూ ఆయన సంస్థాగత లోపాలను ఎత్తి చూపి అగ్రనాయకత్వం చేత క్రమశిక్షణ చర్యలకు గురయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒకసారి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అయినా తన దూకుడు మాత్రం తగ్గించుకోలేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఇతర మతాల విమర్శిస్తూ వీడియోలు, పోస్టులు పెడుతుంటాడని పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మెటా చర్యలు చేపట్టింది.  

Also Read :  మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తొలగింపు..  

సోషల్‌ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్‌ ల్యాబ్‌ (IHL) వెల్లడించిన నివేదికలో తెలిపింది. నివేదిక వెల్లడించిన వారం తర్వాత మెటా ఈమేరకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. తొలగించిన ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా, ఇన్‌స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.


 Also Read :  నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!


నిజానికి 2020లోనే రాజాసింగ్ సంబంధించిన  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లపై నిషేధం విధించింది. అయితే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు. మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను తిరిగి సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్‌కు చెందిన ప్రసంగాలు, కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టులే నిషేధానికి కారణమని తెలుస్తున్నది.

Also Read :  Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

Also Read:Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment