BRS : బీఆర్ఎస్ కు షాక్..జీహెచ్ఎంసీలో జనసేన పోటీ

తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. తెలంగాణపై పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జనసేన సభలో తెలంగాణ గురించే పవన్‌ ఎక్కువగా మాట్లాడారు.

New Update
bjp-tdp-janasena

bjp-tdp-janasena

BRS : తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు టార్గెట్‌గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణపై పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తెలంగాణ గురించే పవన్‌ ఎక్కువగా మాట్లాడారు.మరోవైపు తెలంగాలో తిరిగి యాక్టివ్‌ అయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కు  ప్రత్యాన్మాయంగా బీజేపీ ఎదుగుతోంది. సనాతన ధర్మం పేరుతో హిందూవులను పోలరైజ్‌ చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఏపీలో లాగే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ఫార్ములా సక్సెస్‌ కావడంతో తెలంగాణలోనూ దాన్ని అమలు చేయాలనే ఉద్ధేశంతో పవన్‌ ఉన్నట్లు తెలుస్తుంది.  నిన్నటి జనసేన సభలో తెలంగాణ గురించే పవన్‌ కళ్యాణ్‌ ఎక్కువగా మాట్లాడారు. తనకు పునర్జన్మ నిచ్చింది తెలంగాణ అంటూనే జనసేనకు జన్మస్థలం తెలంగాణ అని, కర్మ స్థలం ఆంధ్రప్రదేశ్‌ అంటూ చెప్పుకొచ్చారు. అంటే రెండు రాష్ట్రాల్లోనూ యాక్టివ్‌గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంకంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో పాటు మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ గతంకంటే ఎక్కువ సీట్లను గెలుసుకుంది. 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలు గెలుసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉండడంతో జనసేనతో కలిసి కూటమిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన సత్తా చాటాలని కూటమి భావిస్తోంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లను ఎదుర్కొవాలంటే కూటమిగా పోటీ చేయడమే మేలు అన్న ఆలోచనలో ఆ మూడు పార్టీల నేతలున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించడంతో అదే జోష్‌తో తెలంగాణలోనూ తమ సత్తా చాటాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా మూడు పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు