/rtv/media/media_files/2026/03/24/ktr-2026-03-24-18-32-29.jpg)
.Komati Reddy's meeting with KTR
Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై కూర్చుని లంచ్ చేయడం చర్చనీయంశంగా మారింది. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం అంరదినీ ఆకట్టుకుంది. లంచ్ పూర్తయిన తర్వాత కూడా వారు అక్కడే రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మాట్లాడుకుంటున్నంత సేపు కూడా ఇద్దరూ నవ్వుతూ ఒకరిని గురించి ఒకరు పొగుడుతూ ఉండటం కనిపించింది.
కాగా గత కొంతకాలంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పై రాజగోపాల్ రెడ్డి అధిష్టానంపై కోపంగా ఉన్న ఆయన కేటీఆర్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ---మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. అధిష్టానం ఇపుడు ఏం చేస్తుందో తెలియదన్నారు.---నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కి, ప్రభుత్వానికి మంచిపేరు -వస్తుంది అన్నారు. నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదన్న రాజగోపాల్ రెడ్డి నిన్న సీఎంతో భేటీ కాలేదని, ఎదురుపడితే పలకరించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తన లాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు పార్టీకి అవసరమని కోమటిరెడ్డి తెలిపారు. అంతేకాక మాజీమంత్రి కేటీఆర్‌తో సమావేశం వివరాలు మాట్లాడుతూ ఇవాళ కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడానని వివరించారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్‌కు చెప్పానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొనడం గమనార్హం
Follow Us