TG Crime: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్‌లో వెలుగులోకి వచ్చింది. నారాయణ కాలేజీలో చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అదే సమయంలో.. కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి అతన్ని పిలిచి తీవ్రంగా మందలించాడు. తనును అవమానించినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. చదువులో తప్పిదం జరిగినప్పటికీ, అందుకు తగినంత మద్దతు లభించకపోవడం, పైగా అదనపు ఒత్తిడితో అవమానం ఎదురుకావడం ఈ ఘోర నిర్ణయానికి దారి తీసినట్లుగా తెలుస్తోంది.
Also Read : ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
గడ్డి మందు తాగి..
జశ్వంత్ తన మనసులో కలిగిన బాధను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వివరించకుండా, మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మానసికంగా దిగులుకు గురైన అతను చివరికి గడ్డి మందు తాగడం ద్వారా ప్రాణాలు తీసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు చికిత్స అందించ లేకపోయారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు.. కాలేజీ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
ఈ ఘటన విద్యార్థులపై కాలేజీల్లో ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంద. చదువుకునే సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి మద్దతు, అవగాహన కలిపించాలి. పరీక్షణ సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యాసంస్థల బాధ్యత, విద్యార్థి సంక్షేమంపై సమగ్ర దృష్టి పెట్టాలి. నారాయణ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతునే ఉన్నాయి. జశ్వంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంచిగా చదువుకుంటున్న కొడుకు మృతి చెందటంతో వారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో పేగు ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి
Also Read : పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
( ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )