/rtv/media/media_files/2025/02/06/7rgCBCvhJkJDU09ukPJo.jpg)
school holidays alert 3 day break for students in telangana schools closed
వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచే స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. 12, 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఎందుకు ఆ సెలవులు ప్రకటించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
వరుసగా మూడు రోజుల సెలవులు
ఏప్రిల్ 12వ తేదీన రెండో శనివారం.
13వ తేదీన ఆదివారం
14వ తేదీన అంటే సోమవారం అంబేద్కర్ జయంతి.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా 12, 13, 14 వ తేదీల్లో సెలవులు రానున్నాయి. అది మాత్రమే కాకుండా.. అంతకంటే ముందు ఏప్రిల్ 10న మహావీర్ జయంతి ఉంది. అది ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 18న మరో సెలవు వచ్చింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. దీంతో పాటు ఏప్రిల్ 30న బసవ జయంతి రోజు ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం పేర్కొంది.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
(ts-school-holidays | school-holidays | latest-telugu-news | telugu-news)
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం
Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!