తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు

తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరం భూమి ఉన్న రైతుల వరకు 17 లక్షల మందికి వేసంగి పెట్టుబడి సాయం అందించారు. తొలి విడత మండాలనికి ఓగ్రామం చొప్పున ఎంపిక చేసి రైతు బరోసా డబ్బులు జమ చేశారు.

author-image
By K Mohan
New Update
rythu Bharosa revanth reddy

rythu Bharosa revanth reddy Photograph: (rythu Bharosa revanth reddy)

తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎకరం వరకు భూమి ఉన్న 17లక్షల మంది రైతులకు బుధవారం రైతు భరోసా నిధులు జమచేశారు. జనవరి 26న రైతు భరోసాతోపాటు మరో రెండు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు మండలానికి ఓ గ్రామం చొప్పున సెలక్ట్ చేసి వారికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేశారు. తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 17.03 లక్షల రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

ప్రారంభోత్సవం నాడు (జనవరి 26) విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈరోజు (బుధవారం) వరకు మొత్తం1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు