/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Road accident Suryapet
Road Accident Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆత్మకూరు మండలంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కీసర దగ్గరకు రాగానే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అన్నదమ్ముల మృతి:
ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు మృతదేహాలను పోర్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు