/rtv/media/media_files/2025/03/31/ApDxGc8bGR9XCK1qAzDU.jpg)
Revath Govt Responds on HCU Land Issue
హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. అనవసరంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని కోరింది. ప్రాజెక్టులో HCU భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవిని తెలిపింది. అలాగే ఈ భూముల్లో చెరువు కూడా లేదని స్పష్టం చేసింది.
మరోవైపు హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బుల్డోజర్లు వర్సిటీ ప్రాంతంలో భూమిని చదునుచేస్తుండగా విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కూడా విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండించింది.
HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad
— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025
Also Read: బిగ్ షాక్.. ఓఆర్‌ఆర్ టోల్ ఛార్జీలు పెంచేశారు బాబోయ్!
హెచ్‌సీయూలో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్‌సీయూది కాదని.. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తయితే హెచ్‌సీయూలో ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.
Also Read: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..
HCU పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. హెచ్‌సీయూ భూములు వర్సిటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ చుట్టూ ఐటీ కారిడర్ ఉండటం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
telugu-news | rtv-news | hyderabad-central-university