Alcohol: మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది.

New Update
alcohol

alcohol Photograph

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధం అవుతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు డిసెంబర్ 31న మందుబాబులు మందేసి చిందేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు  తెలంగాణ రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా  జరుగుతున్నాయి.

Also Read :  ఏపీలో దారుణం.. నోరు మూసి... పొదల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై

అర్థరాత్రి 12 గంటల వరకు పర్మిషన్

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రాష్ట్రంలోని వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా  కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు  కాంగ్రెస్‌ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలంటూ ఫ్యాన్‌ సూసైడ్‌ లెటర్‌

అయితే.. ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా ఆంక్షలు మాత్రం విధించారు. GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై ఎక్కువ నిఘా పెంట్టాలని పోలీసులకు సూచించారు. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సాగరతీరాన సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Also Read :  Swiggy Report 2024: హైదరాబాద్ వాసులు ఆటగాళ్లే.. బిస్కెట్స్‌లా కొనేసిన కండోమ్ ప్యాకెట్స్, లక్షల్లో ఆర్డర్స్..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటూ ఇందిరమ్మ ఇళ్ళపై కూడా అధికారులకు మార్గ దర్శకాలను జారీ చేశారు.  

author-image
By Manogna alamuru
New Update
CM Revanth

CM Revanth

భూ భార‌తిని  సోమ‌వారం ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ప్రజలకు, రైతులకు భూ భార‌తిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  అనంత‌రం రాష్ట్రంలోని ప్ర‌తి మండ‌లంలోనూ క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌జలు, రైతుల‌కు అర్ధ‌మ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్ట‌ల్ ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్ట‌ల్ బ‌లోపేతానికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. 

అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళు..

ముఖ్యమంత్రి నిర్హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌, సీసీఎల్ఏ కార్య‌ద‌ర్శి మ‌క‌రంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. దీంతో పాటూ ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఇందులో అత్యంత నిరుపేద‌లు.. అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి అని సీఎం చెప్పారు. గ్రామ స్థాయిలో ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఇందిర‌మ్మ క‌మిటీలు జాగ్ర‌త్త వ‌హించాల‌ని.. అర్హుల‌నే ఎంపిక చేయాల‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ క‌మిటీ త‌యారు చేసిన జాబితాను మండ‌ల త‌హ‌శీల్దార్‌, ఎంపీడీవో, ఇంజినీర్‌ బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి త‌నిఖీ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవ‌రైనా అన‌ర్హుల‌కు ఇల్లు ద‌క్కిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌మే దానిని ఇందిర‌మ్మ క‌మిటీకి తెలియ‌జేసి  ఆ స్థానంలో మ‌రో అర్హునికి ఇల్లు మంజూరు చేయాల‌న్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల పేరుతో ఎవ‌రైనా దందాలు చేస్తున్న‌ట్లు తెలిస్తే వెంట‌నే కేసులు న‌మోదు చేయాల‌న్నారు. ఇందిర‌మ్మ ఇంటి ల‌బ్ధిదారుకు మంజూరైన ఇంటికి అత‌ని సౌల‌భ్యం ఆధారంగా అద‌నంగా 50 శాతం మేర నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం అన్నారు.

 today-latest-news-in-telugu | cm-revanth-reddy | Bhu Bharathi | indiramma-houses 

Also Read: SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ

Advertisment
Advertisment
Advertisment