/rtv/media/media_files/2025/02/27/YUR0MZSagx2OyuKNSAAX.jpg)
Tv9 Founder Ravi Prakash
TV9 లోగో వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. TV9 మాతృసంస్థ ABCL అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నిబంధనల ఉల్లంఘణపై TV9 ఫౌండర్ రవి ప్రకాష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ABCL నుంచి తనకు రావాల్సిన హక్కులపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ABCL..TV9 లోగో ఉపయోగించినందుకు ఒప్పందం ప్రకారం 4శాతం రెవెన్యూ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. TV9 లోగోను 2019 తర్వాత ABCL వినియోగించే అవకాశం లేనందున లోగో కాపీరైట్ తన పేరు మీదకు మార్చాలని కోర్టును కోరారు. దీంతో ఢిల్లీ హైకోర్టు TV9 మాతృసంస్థ ABCLకు ఈ విషయంపై నోటీసులు పంపింది.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
రూ. 168 కోట్ల చెల్లింపుపై ఆదేశాలు
లోగో వినియోగం విషయంలో రూ. 168 కోట్ల చెల్లింపుపై ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది. 4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల న్యూస్ ఛానల్‌గా TV9ను తీసుకొచ్చి సంచలనం సృష్టించారు రవి ప్రకాష్. 2004 ఫిబ్రవరి 1న TV9 ప్రారంభమైంది. TV9 ఆరంభం నుంచి డైరెక్టర్‌గా, CEOగా రవి ప్రకాష్ వ్యవహరించారు.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
15 ఏళ్లలో టీవీ9ను అభివృద్ధి చేయడంలో రవిప్రకాశ్ కీలక పాత్ర పోషించారు. 2009లో టీవీ9 లోగోపై కాపీరైట్ ప్రొటెక్షన్ రిజిస్టర్ అయ్యింది. దీనికి రవిప్రకాశ్ ఆథర్‌గా ఉన్నారు. టీవీ9ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఉండటం వల్ల.. ఆ లోగోను ABCL వినియోగించినందుకు ఈ సంస్థ రవిప్రకాశ్‌కు రావాల్సిన చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లోగో హక్కు, చెల్లింపులపై ABCL మరో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.