Telangana: తెలంగాణలో ఎయిర్‌పోర్టులపై సంచలన అప్‌డేట్

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

New Update
Rammohan Naidu Key Update on Telangana Airports

Rammohan Naidu Key Update on Telangana Airports

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. విమాన రాకపోకలకు అనుకూలత ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

Also read: ముస్లిం పురుషులు మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు కీలక తీర్పు

ఆదిలాబాద్‌లో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడేలా పెద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనికోసం రక్షణశాఖతో కలిసి పనిచేసేందుకు సివిల్ ఏవియేషన్ రెడీగా ఉందని తెలిపారు. ఏప్రిల్ 17న అధికారులు ఆదిలాబాద్‌లోని క్షేత్రస్థాయిలో భూములు పరిశీలిస్తారన్నారు. ప్రస్తుతం అక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు అదనంగా కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు.  

Also Read: విమాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

అలాగే కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్టుపై వచ్చిన నివేదిక సానుకూలంగా ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి తమకు అప్పగిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని.. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.   

Advertisment
తాజా కథనాలు