Weather Alert: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

New Update
Heavy Rains

Heavy Rains

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.    

Also Read: ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు కలకలం.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత

అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగితే తర్వాతి మూడ్రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.

Also Read: నేడే 'నీట్‌-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే

Advertisment
తాజా కథనాలు