BIG BREAKING: మున్సిపల్ ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సంక్షేమ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఎక్స్ వేదికగా తెలిపారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సంక్షేమ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఎక్స్ వేదికగా తెలిపారు. సామాజిక న్యాయం, గౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ప్రజలు సపోర్ట్ చేశారంటూ పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, నేతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం మీది, తెలంగాణ ప్రజలదని అన్నారు. ప్రతి కుటుంబ వృద్ధికి చేరుతున్న ప్రజాపాలన అనే మన విజన్‌ అంచ‌లంచెలుగా ఎదుగుతోందని రాసుకొచ్చారు. 

ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో కాంగ్రెస్‌ 1,347 వార్డుల్లో గెలిచి 66 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 717 వార్డుల్లో విజయం సాధించి 13 మున్సిపాలిటీల్లో గెలిచింది. ఇక బీజేపీ 261 వార్డుల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 256 వార్డుల్లో గెలిచారు. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజార్చీ రాలేదు. దీంతో ఆయా చోట్ల హంగ్‌ ఏర్పడింది. మరోవైపు 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకుంది. మిగతా చోట్ల హంగ్‌ ఏర్పడింది. 

Also read: మహబూబ్ నగర్ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. చీరాల బీచ్‌కు అభ్యర్థుల బృందం

మేజిక్ ఫిగర్ దాటని మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై.. తర్వాత చేపట్టే కార్యాచరణ అంశాల గురించి చర్చలు జరపనున్నారు. హంగ్ వచ్చిన స్థానాల్లో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాలను దక్కించుకునేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 20కిపైగా హంగ్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ సొంతం చేసుకోనున్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు