సంక్రాంతి పండగకు వరుసగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రావడంతోనే హైదరాబాద్ లోని జనమంతా సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జనమంతా సొంతూళ్లకు కార్లలో, బైక్స్ పై వెళ్తుండటంతో ప్రధాన రాహదారులన్ని రద్దీగా ఉన్నాయి. Also Read : నెత్తురొడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్! సంక్రాంతికి ఆంధ్ర వైపుకు వెళ్లే వాహనదారులకు రాచకొండ పోలీస్ వారి విజ్ఞప్తిపెద్ద అంబర్పేట్ (EXIT-11) నుండి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు సంక్రాంతి పండగ వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన వేరే మార్గాలు సూచించడం అయినది.🚦ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట… pic.twitter.com/Jtaxiu9fvG — Rachakonda Police (@RachakondaCop) January 11, 2025 హైదరాబాద్-విజయవాడ హైవే (Hyderabad-Vijayawada Highway) పై ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది కార్లు రోడ్డెక్కడంతో విజయవాడ హైవేపై నెమ్మదిగా వాహనాలు సాగుతున్నాయి.. గంటలకు 30-40 కి.మీ. వేగాన్ని మించి వాహనాలు వెళ్లలేకపోతున్నాయి.. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏర్పడింది. పంతంగా టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాచకొండ పోలీసులు వాహనదారులకు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వేరే మార్గాలను సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. Also Read : ఇదెక్కడి స్కామ్ రా బాబు: మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10 లక్షలట సంక్రాంతి (Sankranti) కి ఆంధ్ర వైపుకు వెళ్లే వాహనదారులకు రాచకొండ పోలీస్ వారి విజ్ఞప్తి. పెద్ద అంబర్పేట్ (EXIT-11) నుండి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు సంక్రాంతి పండగ వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన వేరే మార్గాలు సూచించడం అయినది. ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. గుంటూరు వైపు వెళ్లేవాళ్లు బొంగులూరు [EXIT-121] గేటు నుండి ఇబ్రహీంపట్నం -మాల్ - దేవరకొండ మీదుగా గుంటూరు చేరుకోవచ్చు అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. Also Read : ఇంకా మండుతూనే ఉంది..10వేల ఇళ్ళు బూడిద పొంగల్ దోపిడీ షురూ ఇక సంక్రాంతి రష్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు. పొంగల్ దోపిడీ షురూ చేశారు. రేట్లు ఆమాంతం పెంచేశారు. ధరలు చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. ప్రస్తుతం రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. మాములుగా అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 1000 ఛార్జీ ఉంటుంది. ఇక వైజాగ్ కు అయితే తక్కువలో తక్కువ రూ. 2 వేలు ఉంటుంది. కానీ ఈ ప్రైవేటు ట్రావెల్స్ లో ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే త్రిబుల్ ఛార్జీలు పెట్టుకోవాల్సిందే. Also Read : గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. డీటెయిల్స్ బయటపెట్టిన రామ్ చరణ్