Pushpa: వెనక్కు తగ్గిన పుష్ప.. ఆ సాంగ్ డిలీట్!

సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

author-image
By srinivas
New Update
allu arjun pushpa

దమ్ముంటే పట్టుకో షెకావత్ సాంగ్ డిలీట్

Pushpa: సంధ్య థియేటర్ ఘనట వివాదం నేపథ్యంలో 'పుష్ప 2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' అనే సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపణలతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఏం టైమింగ్ సార్ అంటూ..

ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలోనే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో క్షణాల్లోనే వైరల్ అయిన సాంగ్ పై 'ఏం టైమింగ్ సార్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపించారు. దీంతో వివాదం మరింత పెంచేలా మారిన షెకావత్ సాంగ్ ను T సిరీస్  నుంచి డిలీట్ చేసింది. కానీ ఇప్పటికే భారీస్థాయిలో షేర్ అయిన సాంగ్.. సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం. 

దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న ఘటన ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ క్రమంలో ఇలాంటి పాట మరింత అగ్గిరాజేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గురువారం చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు, సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని మరింత రెచ్చిగొట్టినట్లు అవుతుందని, ఇది తిరిగి తిరిగి తమ మెడకే చుట్టుకుంటుందని భావించిన నిర్మాతలు పాటను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో దిల్ రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 'గేేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ ముగించుకుని అమెరికా నుంచి రాగానే సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిర్మాత.. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్తామని ప్రకటించారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

కొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. ఒక యువతితో నాలుగేళ్లు.. మరో యువతితో ఏడాది పాటు ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు యువతులు అతడ్నే పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు.

New Update
telangana young man

telangana man married two young women

తెలంగాణలో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించిన ఓ యువకుడు.. ఇద్దరినీ ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

ఇద్దరు యువతులతో ప్రేమ

కొమరంభీం జిల్లా జైనూరు మండలానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతులు అడ్డెసర గ్రామంలో నివాసముంటున్నారు. వీరి రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్ గతకొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 
ఇక ఆమెతో పాటు కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. అయితే 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.  
దీంతో ముగ్గురు ఫ్యామిలీలు అక్కడకు చేరుకోవడంతో పరిష్కారం దొరికింది. ఇద్దరు అమ్మాయిలూ తమ ప్రేమికుడు చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకున్నారు. దీంతో పెళ్లి పత్రికలు ముద్రించి ఒకే మండపంలో వివాహం చేసుకున్నారు.
marriage | latest-telugu-news | telugu-news | telangana
Advertisment
Advertisment
Advertisment