BIG BREAKING: పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకున్న పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించారు.

New Update
Pawan kalyan and Modi

Pawan kalyan and Modi

ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకున్న పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు HICCలో ప్రధాని మోదీ.. రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

Also read: పెట్రోల్, డీజిల్ పరిమితంగా వాడండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

అయితే తన నివాసానికి వచ్చి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ప్రధాని ఫోన్ చేసి పరామర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.  ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూసే నాయకుడు మోదీ అంటూ ప్రశంసించారు. దేశ బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగతంగా పరామర్శించడం గొప్ప విషయమన్నారు. ప్రధాని ప్రేమ, మార్గదర్శనం ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ రాసుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు