PM Modi: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా HICCలో రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

New Update
PM Modi

PM Modi

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా HICCలో రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడర్, గద్వాల-మహబూబ్‌నగర్ 80 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి, జహీరాబాద్‌ పారిశ్రామిక సిటీ, కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్‌ పెట్రోలియం టెర్మినల్, అలాగే వరంగల్ పీఎం మిత్ర పార్క్ ప్రాజెక్టులు ఉన్నాయి. సీఎం రేవంత్ కూడా ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

Also Read: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయమైనది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రారంభోత్సవాలతో యువతకు ఉద్యోగ కల్పన జరగనుంది. ఉద్యోగవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టైక్స్‌టైల్స్‌ రంగానిక ఊతమిస్తుంది.దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీని పెంచేందుకు కృషి చేస్తున్నాం. 

తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి.2014కు ముందు ఏపీకి వెయ్యి కోట్ల కన్నా తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనుల కోసం కేటాయించాం. రూ.15 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు అయిదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇచ్చాం. 6 అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని'' ప్రధాని మోదీ అన్నారు. 

మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉన్నట్లు తెలిపారు. దేశ GDPకి రాష్ట్రం నుంచి 5 శాతం వాటా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని.. తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే అవసరమైన అభివృద్ధి ఉత్సవమన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుందని.. ఇందులో తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇక 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై  ప్రధాని మోదీ దృష్టి సారించాలని సూచించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌ అభివృద్ధి కోసం సహకరించారని.. ఆయనలాగే ప్రధాని మోదీ కూడా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 

Advertisment
తాజా కథనాలు