/rtv/media/media_files/2025/01/22/2tBJmA6yQvlQ2Rc6BYGH.jpg)
political angry Photograph: (political angry)
TS Politics: అన్న మాట, కొట్టిన దెబ్బ తిరిగి వెనక్కి తీసుకోలేం.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పొలిటికల్ లీడర్స్ ఏదో మాట వరసకు నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అంటారే తప్పా అది నిజంగా సాధ్యం కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఆచితూచి నడుచుకుంటారు. ఎందుకంటే.. అధికారులు వెంట ఉంటారు. ప్రజలు గమనిస్తుంటారు. మీడియా ఫాలో అవుతుంది. వివాదస్పద మాటలన్నా.. చేయి చేసుకున్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతారు.
తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేంద్ర(Eatala Rajendar) కూడా ఓ వ్యక్తి చెంప చెల్లుపనిపించాడు. ఎప్పుడూ అంత కూల్‌గా కనిపించే ఈటెల అంత ఫైర్ ఎందుకయ్యారు? రాజకీయ నాయకులకు ఓపిక చాలా అవసరం ఎందుకంటే రోజులో చాలామందిని కలుస్తారు, వారితో మాట్లాడుతుంటారు. అందరిని మ్యానేజ్ చేస్తేనే లీడర్ అవుతాడు. అయితే తెలంగాణలో కొంతమంది ప్రజాప్రతినిధిలు యాంగర్‌మ్యానేజ్‌మెంట్‌కు బ్రాండ్ అంబాసిటర్‌గా ఉంటారు. వాళ్లు ఏది మాట్లాడినా గొడవలే, ఏ చేసినా కాంట్రవర్సిలే.. ఇలా వాళ్లు నిత్యం వార్తల్లో కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.
పొలిటికల్ లీడర్స్ ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా.. లైన్ దాటరు. సాధ్యమైనంత వరకు రాజకీయనాయకులు కంట్రోల్‌లోనే ఉంటారు. నోరు జారి ఓ మాట అన్నారో.. ఊరు కోడై కూస్తుంది. కట్టలు తెంపుకునే ఆవేశం వచ్చినా.. కంట్రోల్ చేసుకోవాలి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఓ రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకున్నాడు. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం పర్యటించారు. తమ స్థలాలను ఓ రియల్‌ఎస్టేట్ బ్రోకర్ కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఎంపీకి మొర్రపెట్టుకున్నారు. దీంతో ఆ రియల్‌ఎస్టేట్ బ్రోకర్ దగ్గరకు వెళ్లిన ఈటల రాజేందర్ కోపంలో అతని చెంపపై ఒక్కటిచ్చారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారింది.
ఏం పీక్కుంటారో పీక్కోండి
జనవరి ఫస్ట్ వీక్‌లో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఓ కార్యకర్తపై బూతులు తిట్టాడు. సమస్యలు చెప్పుకుందామని తన దగ్గరకి ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తను ఏం పీక్కుంటారో పీక్కోండి అని అన్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానిస్టేబుల్‌పై చేయి లేపిన హరీశ్ రావు
అదే నెలలో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్(BRS MLA Harish Rao) రావు పోలీసులపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని(Padi Kaushik Reddy) పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. పోలీసులు హరీశ్ రావును అక్కడ నుంచి తరలిస్తున్న సమయంలో వాగ్వాదం జరింగింది. ఫైర్ బ్రాండ్ హరీశ్ రావు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఓ కానిస్టేబుల్‌పై చేయి చేసుకోయే వీడియోలు కూడా ఇంటర్‌నెట్‌లో హల్ ఛల్ అయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హరీశ్ రావు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బూతులు తిట్టిన వీడియోలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంటాయి.
Also Read : Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి
ఖయ్యానికి కాలు దువ్వే కౌశిక్ రెడ్డి
కదిలిస్తేనే సీమ టపాకాయలో పేలిపోయే ఫైర్ పాడి కౌశిక్ రెడ్డి.. అబ్బో కారు పార్టీలో సారు జోరు అంతా ఇంతా కాదు.. ఊ అంటే ఖయ్యానికి కాలు దువ్వుతుంటాడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి జిల్లా అధికారుల ముందే చేయి చేసుకున్నాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో వివాదం విషయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి తొడలు కొట్టి సవాల్ చేశారు. ఒకటి రెండూ కాదు గత ఆరు నెలల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా కాంట్రవర్షియలే.
అధికారులను దబాయించే కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అధికారులను దబాయించడంతో దిట్ట. చెల్లి కవిత అరెస్ట్ టైంలో ఈడీ అధికారులతో, ఈ ఫార్ములా కేసు(Formula e Car Race Case) విచారణ సమయంలో కేటీఆర్ నానా సభస చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఫార్ములా కేసు విచారణలో అడ్వకేట్‌తోపాటు విచారణకు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. దానికి ఏసీబీ అధికారుల ఒప్పుకోలే. దీంతో ఏసీబీ అధికారులు, కేటీఆర్ మధ్య వాదన జరిగింది. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై మీటింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, పార్టీ ఆఫీస్‌కు వెళ్లి మీటింగ్ పెట్టుకోవాలని డీసీపీ కేటీఆర్‌కు సూచించారు. దీంతో డీసీపీతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకంత భయమంటూ ప్రశ్నించారు.
నాల్గైదు సంవత్సరాల క్రితం కూడా విలేఖరులు అడిగిన ప్రశ్నకు.. కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ లం*** కొడుకు చెప్పిండు మీకు అని బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read : Fake 500Rs: తస్మాత్ జాగ్రత్త... మార్కెట్ లోకి నకిలీ రూ.500 నోట్లు!
జగ్గారెడ్డి కలెక్టర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Former Mla Jagga Reddy) కూడా మహిళా కలెక్టర్‌ను కించపరిచే విధంగా స్టేజ్‌పైన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024 ఆగస్ట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల మీటింగ్‌లో కార్యకర్తలు పక్కకు జరపడానికి వారిని వెనక్కి నెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలపై మంత్రి పొన్నం చేయి చేసుకున్నా అప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పోలీసులు, ప్రభుత్వ అధికారులను అవమానిస్తూ దుర్భాషలాడుతారని టాక్ ఉంది. గతంలో ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఆడియోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.
బీజేపీ ఎంపీలు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ కూడా కాంట్రవర్షియల్ కామెట్స్‌కు కేర్ ఆఫ్ అడ్రస్.. కేటీఆర్, కేసీఆర్, కవితలపై ధర్మపురి అర్వింద్ వ్యక్తిగత విమర్శలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా ఫైర్ బ్రాండే.. అపొసిషన్ పార్టీలను డెరెక్ట్ అటాక్ చేయడంలో బండి సంజయ్ ముందుంటాడు. ఆయన విమర్శలకు కొంచెం పదునెక్కుకే. బండి సంజయ్ కూడా పరుష పదజాలంతోనే పొలిటికల్ పార్టీలకు కౌంటర్లు ఇస్తారు.