/rtv/media/media_files/2025/04/02/NHL3yYY7oyszhkY3ReUQ.jpg)
HCU students lathi charged by Police
తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. HCUకి సంబంధించిన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ మేరకు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వందల మంది విద్యార్థులు హెచ్‌సీయూ గేట్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.
HCU విద్యార్ధులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.
— Balka Suman (@balkasumantrs) April 2, 2025
పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన విద్యార్ధులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు. pic.twitter.com/0Cbfbqvilc
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
విద్యార్థులపై లాఠీ ఛార్జ్
దీంతో HCU లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు తాజాగా కొరడా ఝులిపించారు. HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లాఠీ ఛార్జ్ అనంతరం రేవంత్ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HCUలో లాఠీఛార్జ్.. pic.twitter.com/rJdR1h7EXh
— Siri Vennela Goud Palle (@VennelaPalle) April 2, 2025
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
మరోవైపు HCU లో విద్యార్థులకు ఉపాధ్యాయులు, యూనివర్సిటీ సిబ్బంది మద్దతుగా నిరసన తెలిపేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2025
HCUలో విద్యార్థులపై మరోసారి లాఠీఛార్జ్
నిరసన తెలుపుతున్న విద్యార్థులను లాఠీలతో చితకబాది.. లాకెళ్తున్న పోలీసులు https://t.co/4p9Bx5mr3r pic.twitter.com/17xek6Ppug
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
అలాగే చిన్నపిల్లలు సైతం HCUకి మద్దతుగా నిలుస్తున్నారు. HCU అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ఆ అడవులను వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించి జంతువులను, పక్షులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి 6వ తరగతి విద్యార్థి విజ్ఞప్తి చేసిన వీడియో వైరల్ అవుతుంది.
#Hyderabad----
— NewsMeter (@NewsMeter_In) April 2, 2025
A scuffle erupted between the police and University of Hyderabad Students Union, Faculty while they were marching towards East Campus of the University on Wednesday morning .
Over the last two days, more than 40 JCBs were deployed to clear the area in… pic.twitter.com/KEc0xQHYl5
(hcu campus land issue | hcu campus lands | revanth-reddy | latest-telugu-news | telugu-news | telangana-news)