/rtv/media/media_files/2024/12/04/jSzpJrdURUNTbknjaF3A.jpg)
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ అంశం ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు వార్తలు వచ్చాయి. వీళ్లు వాడే ఫోన్లకు అలెర్ట్ మెసెజ్‌లు కూడా వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్‌లు చేయించిందని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. అయితే 2019 నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసిస్ స్పైవేర్ వివిధ రాజకీయ నాయకులు, అధికారులను టార్గెట్ చేసింది. తమ ఫోన్లను అలెర్ట్ మెసెజ్‌లు వచ్చాయని కూడా గతంలో పలువురు రాజకీయ నాయకులు చెప్పారు.
Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!
అయితే తెలంగాణలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మానవ హక్కుల కార్యకర్త బల్లా రవీంద్రనాథ్ ఫొన్లు కూడా ట్యాప్ అయ్యాయి. కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి విచారణ జరగలేదు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త గధగోని చక్రధర్ గౌడ్.. మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు పెట్టారు. 2023లో ఆగస్టు 29న తను వాడే యాపిల్ ఫోన్‌కు వార్నింగ్ మెసేజ్ వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్‌లో ఉండే సున్నితమైన డేటా, కమ్యూనికేషన్స్, డివైజ్ మైక్రోఫోన్ అలాగే కెమెరాను కూడా స్టేట్ స్పాన్సర్స్ అటాకర్లు యాక్సెస్ చేసే ఛాన్స్ ఉందని అందులో ఉందని తెలిపారు. తన భార్య, సహచరులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని పేర్కొన్నారు.
Also Read: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం
2023 జనవరిలో ఆర్ఎస్ ప్రవీణ్ వాడుతున్న యాపిల్ ఫోన్‌కు కూడా ఈ అలెర్ట్ మెసేజ్ వచ్చింది. తన ఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ హాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హెచ్చరించింది. ఆ సమయంలో దీనిపై స్పందించిన ప్రవీణ్ కుమార్.. ఇది రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీ లేదా కేంద్ర స్థాయిలో బీజేపీకి పార్టీ పని అయి ఉంటుందని ఆరోపించారు. ఇక 2019 నవంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన పౌర హక్కుల అడ్వకేట్ రవింద్రనాథ్ కూడా గుర్తుతెలియని ఫోన్ నుంచి మెసెజ్‌లు వచ్చాయని, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నించారంటూ తెలిపారు.
గత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఈ స్పైవేర్‌ను దుర్వినియోగం చేశారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 1400 మంది పౌరహక్కుల కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టుల ఫోన్లపై ఈ పెగాసిస్ స్పైవేర్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:హైకోర్ట్ లో హరీష్ రావు క్వాష్ పిటిషన్.. పోలీసులకు ఆదేశాలు!
ఇది కూడా చదవండి: రోశయ్య క్రమశిక్షణ నాకు స్ఫూర్తి.. ఆయన వల్లే తెలంగాణ ఏర్పాటు!