![cm revanth reddy](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/LqIy62qABNcfxSss1eGT.jpeg)
cm revanth reddy
తెలంగాణలో మరోసారి కులగణన చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. కులగణన సర్వేలో పాల్గొనని 3.1శాతం వారి కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మళ్లీ కులగణ సర్వే నిర్వహించనున్నామని బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో స్థానికి ఎన్నికలు వాయిదా పడనున్నాయి.
కొందరు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో వివరాలు వెల్లడించలేదని ఉపముఖ్యమంత్రి మీడియా సమావేశంలో అన్నారు. కులగణనలో బీసీల లెక్కలు తప్పుగా చూపించారని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన సర్వేతో పోల్చుకుంటే వెనుకబడిన తరగతుల జనాభా రాష్ట్రంలో 10 శాతం తగ్గడమేంటని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కులగణన సర్వేలో 96 శాతం కుటుంబాలు పాల్గొన్నాయని.. మిగిలినవారు ఈసారి కులగణన సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలను కోరారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి అన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం అన్నీ పార్టీలను కలుపుకొని పోతామని.. కులగణన బిల్లును కేంద్రానికి పంపుతామని భట్టి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో మార్చి మొదటి వారంలో క్యాబినేట్ తీర్మానం ఉంటుందని ఆయన తెలిపారు. రిజర్వేషన్ కల్పించే అంశంలో రాజకీయపరంగా ఎన్ని కుట్రలు చేసినా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే మార్చిలో అకాడమిక్ పరీక్షలు కూడా ఉంటాయి. దీంతో తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం తెలియాల్సిఉంది.