/rtv/media/media_files/2026/04/20/cable-bridge-2026-04-20-16-27-03.jpg)
Cable Bridge
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి మీద పోలీసు పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో ఆ వంతెనపై నిత్యం పోలీసులు గస్తీ కాసేవారు. అక్కడ ఎవరైనా వాహనాలు నిలిపేందుకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ బ్రిడ్జిపై ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల భార్య కళ్లముందే భర్త ప్రమాదంలో మృతి చెందడం సంచలనం రేపింది.
Also read: జమ్మూ-కశ్మీర్‌లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
శ్యామ్ రాజ్ అనే వ్యక్తి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల తెల్లవారుజామున తన భార్యతో కలిసి ఫొటోలు దిగుతున్నాడు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ఓ BMW కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగాక కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. తీవ్రంగా గాయాలపాలైన శ్యామ్‌రాజ్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
కేబుల్ బ్రిడ్జి మీద కొరవడిన పోలీసుల పర్యవేక్షణ
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2026
భార్య కళ్ళెదుటే భర్త మృతి
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తెల్లవారుజామున భార్యతో కలిసి ఫొటోలు దిగుతున్న శ్యామ్ రాజ్ అనే వ్యక్తిని అతివేగంతో ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు (WB 06 B 7003)
ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి… pic.twitter.com/CV2gAtOj9H
Also Read: మంచిర్యాలలో దారుణం:...వంద రూపాయల అప్పు కోసం ప్రాణం తీసిన ఉన్మాది!
మరోవైపు ఇటీవల కొందరు దుండగులు కేబుల్ బ్రిడ్జి మీద ఉన్న లైటింగ్ సెటప్‌ను ఎత్తుకెళ్లారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. శనివారం రాత్రి కూడా వంతెనపై వాహనాదారులు ఎక్కడిక్కడే కార్లు, బైక్‌లను పార్క్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ''Hi Hyderabad'' అనే ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.
Saturday Night @ DCB 🌉
— Hi Hyderabad (@HiHyderabad) April 20, 2026
So many bikes & cars are parked on the carriageway! @CYBTRAFFIC@cyberabadpolicehttps://t.co/ol7U7GtJ4Spic.twitter.com/UOpOsDqMRr
ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల గస్తీ లేకుండానే అక్కడ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వాహనాదారులు ఇష్టం వచ్చినట్లు తమ వాహనాలు అక్కడ నిలిపివేస్తున్నారు. మరికొందరు అతివేగంగా నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు అధికార ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందుకే కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణను ఏర్పాటు చేసి, వాహనాదారులు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Follow Us