KCR's Key Meeting : బీఆర్‌ఎస్‌లో కొత్త వ్యూహం.. రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్ కీలక సమావేశం!

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకల ముగింపు దశలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

New Update
KCR Assembly

KCR's key meeting on silver jubilee

KCR's key meeting : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకల ముగింపు(25 years silver jubilee Celebrations ) దశలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌(telangana-bhavan) లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలందరికీ ఆహ్వానాలు అందాయి. ఇందులో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు హాజరుకానున్నారు.

ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనుంది. ముఖ్యంగా పలు అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.పార్టీలో నూతన రక్తాన్ని చేర్చడం, పాత కార్యకర్తలను యాక్టివేట్ చేయడం కోసం సభ్యత్వ నమోదు/పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేయడంపై చర్చించనున్నారు.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన రాజకీయ వైఖరిపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. - brs party silver jubilee celebrations

Also Read :  హుందాగా మాట్లాడితే డిపాజిట్లయినా దక్కుతాయి : సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ

రజతోత్సవ సంబురాల ముగింపు కావడంతో, ఈ సమావేశం నుంచి కేసీఆర్ ఎలాంటి కీలక ప్రకటన చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారుతున్న వేళ, పార్టీని గాడిలో పెట్టేందుకు మరియు కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోనున్నారు. పార్టీ పగ్గాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన 'యాక్షన్ ప్లాన్‌'ను ఆయన ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read :  సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై విచారణ!

Advertisment
తాజా కథనాలు