Crime: తెలంగాణలో దసరా వేళ విషాదం.. ముగ్గురు మృతి
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం వినూత్నంగా తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నాడు. ఒక్కో కూపన్ ధర రూ.500గా నిర్ణయించాడు. ఇందులో గెలిపొందిన వ్యక్తులు రూ.16లక్షల విలువ చేసే స్థలాన్ని పొందుతారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
RRR దక్షిణ భాగం రోడ్డు కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు భూనిర్వాసితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మార్చారని, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
మదర్ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రూ.80 లక్షల చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.66.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడులో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చెస్తున్న కార్మికుడి మృతి చెందాడు. అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు వద్ద బిహార్ కార్మికులు ఆందోళన చేశారు. దానికి చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు.