రాజకీయాలు చదువుకున్న స్కూల్ కు వెళ్లిన ఎంపీ చామల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తాను విద్యను అభ్యసించిన నల్గొండలోని ఆల్ఫోన్స్ స్కూల్ ను సందర్శించారు. తనకు 2-8వ తరగతి వరకు క్లాస్ టీచర్ గా పని చేసిన టీచర్ కేథరిన్, హిందీ టీచర్ గులాం జిలానిని ఎంపీ సన్మానించారు. స్కూల్ లోని మధుర అనుభూతులను గుర్తు చేసుకున్నారు. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Nalgonda: అనుచరుల కోసం రింగ్ రోడ్ ప్లాన్ మార్పు.. కోమటిరెడ్డిపై సంచలన ఆరోపణలు! అనుచరులకు దోచి పెట్టేందుకే నల్లగొండ రింగ్ రోడ్ ప్లాన్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. ప్లాన్ 1, 2 వదిలేసి ప్లాన్ 3 ఎంచుకోవడంలో అంతర్యం ఇదేనన్నారు. 15 రోజుల్లో ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. By Nikhil 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే! ఛత్తీస్‌గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో అప్పటి వరకు వర్షాలే.. ఐఎండీ కీలక ప్రకటన! జూన్ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఐఐఎంలో సీటు సాధించిన విద్యార్థికి కోమటిరెడ్డి సాయం చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన యాకరి యాదయ్య కుమార్తె భావన భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ యువతికి ఉత్తరాఖండ్‌లోని ఐఐఎం కాశీపూర్‌లో ఎంబీఏ ఎనలిటిక్స్ లో అడ్మిషన్ లభించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించి రూ.లక్ష అందించారు. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం, మంత్రులు.. అధికారులకు కీలక ఆదేశాలు వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: యాదాద్రికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: బీర్ల ఐలయ్య యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn