/rtv/media/media_files/2024/12/11/7QtsxvPLrU62RtEeHXHK.jpg)
Nalgonda 10th class paper leak case Six members arrest
TG 10th Exams: నల్గొండ నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ రాష్ట్రం వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలో..
ఈ మేరకు నకిరేకల్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ఈ జరిగిన చోటు చేసుకుంది. శుక్రవారం పరీక్షాకేంద్రంలోకి అక్రమంగా చొరబడిన కొంతమంది ఒక విద్యార్థి దగ్గరున్న ప్రశ్న పత్రాలను ఫొటో తీశారు. అనంతరం ఆ ప్రశ్నలకు సమాధానాలు సేకరించి, వాటిని జిరాక్స్ తీయించి విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నించారు.
Also Read: బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు
ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ ఎ.రాజశేఖర్ తెలిపారు. నిందితులంతా నకిరేకల్‌కు చెందిన ప్రైవేటు టీచర్ గుడుగుంట్ల శంకర్, జిరాక్స్ నిర్వాహకుడు బ్రహ్మదేవర రవిశంకర్, చిట్ల ఆకాశ్, బండి శ్రీను, చిట్ల శివ, ఒక బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుల వద్ద 5 సెల్‌ఫోన్‌లు, జిరాక్స్ మిషన్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
telangana-10th-exams | paper-leak | today telugu news | latest-telugu-news