Nagarjun Sagar: నాగార్జున్ సాగర్‌కు ప్రమాదం పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఆయా బ్లాకుల్లో 6 మీటర్ల లోతు గుంతలు పడ్డాయని, వెంటనే మరమత్తులు చేపట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమైనా చేయించాలని కోరుతున్నారు. సాగర్ డ్యామ్ లో 26 బ్లాకులు.. ఈ మేరకు ఇటీవల సాగర్ ను పరిశీలించిన నిపుణులు.. మొత్తం డ్యాం లో 26 బ్లాకులుండగా ఆయా బ్లాకుల్లో 1 నుంచి 6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. క్రెస్ట్ గేట్ల నుంచి నీరు విడుదలయ్యే ప్రదేశం(స్పిల్‌వే ఓగీ) లో గుంతలు బడ్డట్టు గుర్తించారు. దీనికి రూ.16.54 కోట్లతో మరమ్మతులు చేసి రెండేళ్లు కాకముందే ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సాగర్ కు చాల కీలకమైన స్పిల్‌వే ఓగీతో పాటు డ్యామ్ నుంచి కిందికి దిగిన నీరు సుడులు తిరుగుతూ వెళ్లే ప్రదేశం(బకెట్ పోర్షన్)లో మరమ్మతులకు రూ.16.54 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే వీటి రిపేర్ పనులు ఏపీవైపునుంచి చేయాల్సివుంటుందని వెల్లడించారు. కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో.. మొదటగా గుంతలు పడిన ప్రదేశాన్ని ఎయిర్ వాటర్ జెట్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గ్రౌటింగ్, డ్రిల్ చేసి రాడ్లు బిగించాలి. పాత, కొత్త కాంక్రీట్‌కు కెమికల్ ట్రీట్‌మెంట్ మిక్స్ చేసి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌తో పాటు కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో పనులు చేపట్టాలని నిపుణులు సూచించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నామమాత్రంగా పనులు చేస్తే ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు. ఈ ప్రాజెక్టు O&O నిధులను గ్రీన్ చానల్ లిస్టులో పెడితే మంచి సంస్థలు పనులు చేసేందుకు ముందుకు వస్తాయని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా రిపేర్ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: మనుబాకర్‌తో పాటు ఆ ముగ్గురికి ఖేల్ రత్న! ఇదిలా ఉంటే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఏపీ ప్రభుత్వంతో జల వివాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా గతేడాది నిర్వహణ పనులన్నీ తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంది. కానీ ప్రాజెక్టు కృష్ణాబోర్డు నియంత్రణలో ఉంది. దీంతో మరమ్మత్తులకు సంబంధించిన పనిని తెలంగాణకు అప్పగిస్తే బాగుటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: SSMB29: మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్ లీక్.. వీడియోలు, ఫొటోలు వైరల్!