MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి ఆర్ఎస్ఎస్ మూలాలే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే మైనారిటీల పట్ల సీఎం రేవంత్ వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నిజామాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కవిత.. గాంధీ కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయంటూ మండిపడ్డారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి*అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారుగాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారుకానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము… pic.twitter.com/MUeONOU5f1 — Sarita Avula (@SaritaAvula) January 12, 2025 తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు.. రాష్ట్రంలో మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గంగాజమునా తెహజీబ్‌లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది? మైనారిటీ డిక్లరేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్! షాదీ ముబారక్ ఇంకెప్పుడు.. ఇక మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్‌లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. రూ.3వేల కోట్లు కేటాయించి కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. షాదీ ముబారక్ కింద రూ.1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారన్నారు. నిజామాబాద్‌లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: Priyanka Chopra: లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు.. మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు !