/rtv/media/media_files/2026/04/13/minister-seethakka-sent-legal-notice-to-kcr-2026-04-13-14-07-56.jpg)
Minister Seethakka Sent legal notice to KCR
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. మంత్రి సీతక్క ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే రిజిస్టర్ పోస్టు ద్వారా సీతక్క తరఫు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ లీగల్ నోటీసులు పంపించారు.
Also read: హైటెక్ సిటీకి సాంస్కృతిక కళ...మాదాపూర్‌లో మరో రవీంద్ర భారతి..
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్క తెలిపారు. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేశారు. అయితే మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్ధమైన ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించారు.
Also Read: ఇక సిలిండర్ అక్కరలేదు..నేరుగా ఇళ్లకే గ్యాస్ పైపులైన్లు.. త్వరలోనే ఆ జిల్లాల్లో షురూ..
మరోవైపు బీఆర్‌ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలంటూ సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 48 గంటల్లోగా కేసీఆర్ క్షమాణపలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులు మంత్రి సీతక్క హెచ్చరించారు.
Follow Us