Seethakka: ఎందుకు భయపడుతున్నావ్‌ కేటీఆర్‌.. సీతక్క ఫైర్

జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్‌.. ఈ- కార్ రేస్ వ్యవహారంపై ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Seethakka KTR

మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో అంబేద్కర్‌ను, రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించారంటూ ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆమె మాట్లాడారు. కేబినెట్ పర్మిషన్ తీసుకొని ఫార్ములా ఈ-కార్ రేసుకు కేటీఆర్‌ డబ్బులు చెల్లించారా అంటూ ప్రశ్నించారు. అసలు సభలో ప్రభుత్వ అనుమతి లేని అంశంపై చర్చ జరపాల్సిన అవసరం ఏముందన్నారు. ఇప్పటికే గవర్నర్ క్లియరెన్స్‌ ఇచ్చిన కేసుకు సభలో చర్చ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఏసీలో ఫార్ములా ఈ-కార్ రేసు మీద చర్చపై బీఆర్‌ఎస్‌ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ముసుగేసుకొని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని విమర్శలు చేశారు. 

Also Read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు!

Seethakka Fire On KTR

'' జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్‌ ఇప్పుడు దీనిపై ఎందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా ?. కేటీఆర్‌ ఇప్పుడు తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుబట్టిన ఆయన.. మరీ ఇప్పుడు కోర్టును ఎందుకు ఆశ్రయించారు. కేటీఆర్‌కు అసలు నిజాయతీ అనేదే లేదు.

Also Read: ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ! 

రాష్ట్రంలో లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై అసలు చర్చనే జరగకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వీళ్లు చేసిన కబ్జాల విషయాలు బయటపడతాయనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ విచారణ ఎదుర్కోవాల్సిందేనని'' సీతక్క అన్నారు. 

Also Read: తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఏపీలో మాత్రమే!

ఇదిలాఉండగా అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు. దీనిపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు.  ఈ క్రమంలోనే అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment