అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. కేటీఆర్‌కు పొంగులేటి సవాల్‌

రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్‌ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,516 కొట్లకు టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
KTR and Ponguleti

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వమే రూ.3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచినందని ఆరోపించారు. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే ఎన్నికల కోడ్‌ ఉన్నా కూడా ఈ టెండర్ల బిడ్‌ ఓపెన్‌ చేసి కట్టబెట్టిందని పేర్కొన్నారు. 

Also Read: జెఎన్‌టీయూహెచ్‌లో మారనున్న సిలబస్‌.. వచ్చే విద్యా సంవత్సరం అమలు

''రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్‌ నిరూపిస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. నిరూపించకపోతే కేటీఆర్‌ రాజీనామా చేస్తారా ?. ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,516 కొట్లు మాత్రమే టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో రూ.39 వేల కోట్లు ప్రజాధనం లూటీ చేశారు. కేటీఆర్‌ ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌ రెడ్డి అల్లుడు సృజన్‌ రెడ్డి ఒక టెండర్‌ దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలో పెద్దలు బెదరించలేదు. మేము పిలిచిన రీ టెండర్లలో గతం కంటే రూ.54 కోట్లు తక్కువకే వచ్చాయి'' అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు