SLBC: టన్నెల్ ఆపరేషన్‌పై కీలక అప్ డేట్.. మరో 2 సంవత్సరాలు పట్టే ఛాన్స్!

SLBC ట‌న్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్ 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిర‌మ్మ ప‌భుత్వ హాయాంలోనే మ‌రో రెండేళ్లలో న‌ల్గొండ-ఖ‌మ్మం జిల్లాల‌ను స‌స్యశ్యామ‌లం చేసే కృష్టాన‌దీ జ‌లాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

New Update
SLBC Tunnel Collapse

Minister Ponguleti gives key update on SLBC rescue operation

SLBC: SLBC ట‌న్నెల్‌ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. న‌ల్గొండ-ఖ‌మ్మం జిల్లాల‌ను స‌స్యశ్యామ‌లం చేసే కృష్టాన‌దీ జ‌లాలు మ‌రో రెండున్నర సంవ‌త్సరాల‌లో అందుబాటులోకి రానున్నాయ‌ని ఆయన అన్నారు. బుధవారం ట‌న్నెల్ ప్రమాద‌స్ధలాన్ని ప‌రిశీలించిన అనంత‌రం శ్రీ‌శైలంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ట‌న్నెల్‌లో స‌హాయ‌క చ‌ర్యలు వేగంగా సాగుతున్నాయ‌ని, మ‌రో 105 -110 మీట‌ర్ల మేర త్రవ్వకాలు పూర్తయితే స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంద‌న్నారు.

250 మీట‌ర్ల మేర రాయి..

ప్రమాదం జ‌రిగిన ప్రాంతంలో 250 మీట‌ర్ల మేర రాయి, బంక‌మ‌న్ను కార‌ణంగా అడ్డంకి ఏర్పడింది. గ‌డ‌చిన 40 రోజులుగా 700-800 మంది వివిధ సంస్థల‌కు చెందిన నిపుణులు ప‌గ‌లు రాత్రి అధికారుల ప‌ర్యవేక్షణ‌లో ప‌నిచేశారు. ప్రస్తుతం 550-560 మంది అత్యాధునిక ప‌రిక‌రాల‌తో స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగిస్తున్నారు. ట‌న్నెల్ లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇత‌ర వ‌స్తువులు అతుక్కుపోవ‌డం వ‌ల‌న అక్కడ బుర‌ద తొలగింపు క‌ష్టసాధ్యంగా, ప్రమాద‌క‌రంగా మారింది. అయిన‌ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప‌క్షాన స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టేవారికి ఏ విధ‌మైన అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేశాం. క‌లెక్టర్‌, ప్రత్యేక ప‌ర్యవేక్షణాధికారి  శివశంకర్ లోతేటి, విప‌త్తు నిర్వహ‌ణాధికారి, ఎస్పీ త‌దిత‌రులు అన్ని వేళ‌లా అందుబాటులో ఉండేలా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

ఈ సంఘ‌ట‌న‌లో ఇంత‌వ‌ర‌కు ఇద్దరి మృత‌దేహాలు ల‌భ్యమ‌య్యాయి. మిగ‌లిన వారి కుటుంబాల‌కు న‌ష్టప‌రిహారం అందేలా క‌లెక్టర్‌కు ఆదేశాలు అందాయి. ఈ ప్రమాదం నేప‌ధ్యంలో ట‌న్నెల త‌వ్వకం సంద‌ర్బంగా భ‌విష్యత్‌లో ఎటువంటి న‌ష్టాలు వాటిల్లకుండా సంపూర్ణ చ‌ర్యలు చేప‌డ‌తాం. దివంగ‌త ముఖ్యమంత్రి రాజ‌శేఖ‌ర రెడ్డి ఆలోచ‌న‌ల‌తో ప్రారంభ‌మైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఇందిర‌మ్మ ప‌భుత్వ హాయాంలోనే సాగునీటిని అందిస్తామన్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నారు, ఎప్పటికప్పుడు అక్కడ పేరుకున్న మట్టి, రాళ్ల దిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలిగిస్తున్నారు. ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా సాగుతోంది. ఏదిఏమైనా ఈ సంఘ‌ట‌న‌లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని మంత్రి పొంగులేటి విచారం వ్యక్తం చేశారు. 

tunnel | minister-ponguleti | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment