/rtv/media/media_files/2025/04/13/IU1AbDvQlKwDyUZ7yMo8.jpg)
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
SLBC Tunnel : ఆ 8 మంది బతికే ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి షాకింగ్ ప్రకటన!
SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బతికే ఛాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Minister Jupally Krishna Rao sensational comments on SLBC incident
SLBC: SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బతికే చాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, హరీష్ రావు, కేసీఆర్ శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
వారు బతికే ఛాన్స్ లేదు..
ఈ మేరకు శుక్రవారం టన్నెల్ ప్రమాదం గురించి మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. వారు బతికే ఛాన్స్ లేదన్నారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SLBCపై హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు. పదేండ్లు పాలించిన బీఆరెస్ ఎందుకు టన్నెల్ ను పెండింగ్ లో పెట్టిందని ప్రశ్నించారు. హరీష్ రావుకు సూటి ప్రశ్న? ఎందుకు 200 లోమీటర్లు SLBC టన్నెల్ తవ్వి మిగతాది వదిలేసిండ్రు? తక్కవ లాభం వస్తుందనా? SLBC పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా? ఈ మూడు ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఅరెస్ శవాల మీద పేలాలు..
అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే slbcని ఎందుకు పెండింగ్ పెట్టారు. Slbc గురించి మాట్లాడే హక్కు బీఆరెస్ కు లేదు. బీఅరెస్ శవాల మీద పేలాలు ఎరుకుంటోంది. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్ లో చిక్కుకున్న 8మంది బతికే చాన్స్ లేదు. సహక చర్యలకు ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు అలెర్ట్ చేయకపోతే 40 మంది వరకు చనిపోయే వారు. పాలమూరు రంగా రెడ్డిలో 6గురు చనిపోయారు. అప్పుడు కేసీఆర్, హరీష్ రావు వచ్చారా? కొండగట్టు బస్ ప్రమాదంలో 70మంది చనిపోతే వీరెక్కెడపోయారని విమర్శించారు.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
SLBC ని పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చాం. కానీ అక్కడికి పోయి రాజకీయాలు ఎందుకు? స్కానర్ ద్వారా తెలుసుకోవడం కోసం జాతీయ ఏజెన్సీలను పిలిచాం. స్వయంగా నేను వెళ్ళాను. 50మీటర్లు మాత్రమే కనిపించట్లేదు. పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరాకు 3లక్షలు అవుతుంది. ఇప్పుడు అదనంగా ఎకరాకు 10 వేలు ఖర్చు పెరిగింది. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల కరెంట్ బిల్ వస్తుంది. యుద్ద భూమిలో ఎలికాఫ్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎన్నిసార్లు ఎలికాఫ్టర్‌లో తిరిగినా ఏడాదికి ఒకసారి రెంట్ కడతారు. నేను బీఅరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన అని హరీష్ రావు అంటుండు. అమరవీరుల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదుకాబట్టే ఆ పార్టీ నుంచి నేను బయటక వచ్చాను. ఇప్పటికైనా హరీష్ రావు శవరాజకీయలు మానుకోవాలని మండిపడ్డారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. Short News | Pages | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
గ్రూప్-1 అవకతవకలను ఆధారాలతో బయటపెట్టామని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి అన్నారు. టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి ఎందుకు లేరని ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Komatireddy Raj Gopal Reddy : రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. వాళ్ల డిమాండ్ కూడా అదే..
కొంతకాలంగా తనకు మంత్రి పదవికోసం ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దూకుడు పెంచారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Elevator accident : హైదరాబాద్ లో మరో లిప్టు ప్రమాదం...ఒకరి మృతి
హైదరాబాద్ నగరంలోని సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలో లిఫ్ట్ మీద పడటంతో వ్యక్తి మృతిచెందాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Implementation of SC classification : రేపటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు
తెలంగాణ ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం