Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!

తెలంగాణ వాసులకు భానుడు మార్చిలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదలైన రెండో వారంలోనే గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండగా.. గురువారం నుంచి భానుడితీవ్రత మరింత అధికం అంటున్నారు అధికారులు.

New Update
Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ఓ కీలక సమాచారాన్ని అందించింది. వేసవి కాలం మొదట్లోనే భానుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. బుధవారం నాలుగు మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవటం గమనార్హం. ఇక.. మార్చి 13వ తేదీ నుంచి తెలంగాణలో ఎండలు మరింత మండుతాయని  వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేడి గాలులు, వడగాల్పులతో మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

Also Read: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశాలున్నాయి. సిద్దిపేట్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్,  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదుకానుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read: Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు!

ముఖ్యంగా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణ పేట్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీలకుపైగా, 10 ప్రాంతాల్లో 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా అయితే.. ఏప్రిల్, మే నెలల్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ.. ఈసారి మార్చి రెండో వారంలోనే 35 డిగ్రీలు దాటేసి 40 డిగ్రీలకు చేరుతుండటంతో జనాలు హడలిపోతున్నారు. అయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చి 4వ తేదీన గరిష్ఠంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు.. రాష్ట్రంలో ఉదయం, రాత్రి సమయాల్లో ఇప్పటికీ కాస్త చల్లని వాతావరణం ఉండగా.. ఉదయం 9 గంటల నుంచి మొదలు సాయంత్రం 6 గంటల వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో.. ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని హడలిపోతున్నారు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

Also Read: Hydrogen Train: ఈ నెల 31 నుంచే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు...ఎక్కడినుంచెక్కడికో తెలుసా..

Advertisment
Advertisment
Advertisment