/rtv/media/media_files/2025/02/11/hQ5Fvm0smn4tnrOdJzKV.jpg)
Masthan Sai Parents Emotional on lavanya case
Mastan sai: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మస్తాన్ సాయి వ్యవహారంపై అతని పేరెంట్స్ అసలు నిజాలు బయటపెట్టారు. తమ కొడుకు గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు. 300 వీడియోలు 100 మంది అమ్మాయిలు అనేది పూర్తి తప్పు అని, ఇప్పటివరకు వాడి మీద ఒక్క అమ్మాయి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం RTVతో మాట్లాడిన మస్తాన్ సాయి తల్లిదండ్రులు.. తన కొడుకుపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు.
పోలీసులను గుప్పెట్లో పెట్టుకుంది..
లావణ్య అనే అమ్మాయి పెద్ద బ్లాక్మెయిలర్. ఆమె ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయగలుగుతుంది. మీడియాను, పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని ఈ కథంతా నడిపిస్తుంది. లావణ్య వల్ల మా జీవితాలు రోడ్డుమీదికి వచ్చాయి. మస్తాన్ సాయి బయటికి వచ్చినంక వాస్తవాలు అన్ని చెబుతానని మాకు చెప్పాడు. లావణ్య నార్సింగ్‌లో ఉన్న పోలీసులని కూడా బెదిరిస్తూ తన గుప్పెట్లో పెట్టుకుంది. తను ఎవరిమీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోవాలని కూడా బెదిరిస్తుంది. లావణ్య ఒక మంత్రగత్తే. బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఉంటుంది. ఎంతోమంది తన వల్ల జీవితాలు కోల్పోయారు. మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. 2022కు ముందు మస్తాన్ సాయి మీద ఒక్క కేసు లేదు. ఎప్పుడైతే లావణ్య పరిచయమైందో అప్పటినుంచి మస్తాన్ మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా లావణ్యనే మస్తాన్ సాయికి డ్రగ్స్ ఇచ్చిందంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!
అలాగే లావణ్య ప్రొడ్యూస్ చేసిన హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ అన్ని బయటికి ఎవరిస్తున్నారని మస్తాన్ పేరెంట్స్ ప్రశ్నించారు. దాంట్లో ఉన్న అమ్మాయిల జీవితాలు రోడ్డు మీదకు వస్తాయని, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ల జీవితానికి బాధ్యులు ఎవరన్నారు. ఇంతకు పోలీసులే ఆ డిస్క్ లో ఉన్న వీడియోస్ బయటపెడుతున్నారా లేదంటే లావణ్య పెడుతుందా అనేది క్లారిటీగా వస్తే బాగుటుందన్నారు. మేము నాయపోరాటం చేస్తాం. మస్తాన్ బయటికి వచ్చిన తర్వాత నిజం నిజాలు ఏంటో తెలుస్తాయి. కోర్టులో అన్ని సాక్షాలు ప్రొడ్యూస్ చేస్తామన్నారు.