Maoist: వరుస ఎన్‌కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టమంటూ లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమే ఇలా చేశామని, వేటకోసం ప్రజలు ఆ పరిసరాల్లోకి రావొద్దని లేఖలో పేర్కొన్నారు.
అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు..
ఈ మేరకు వాజేడు - వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేయగా.. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టమని తెలిపారు. వేట కోసం, షికారు కోసం కర్రీగుట్ట దగ్గరకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబులు తొక్కి అమాయక ప్రజలు చనిపోతున్నారని అన్నారు.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
మరికొంతమంది ప్రజలకు పోలీసులు డబ్బులు ఇచ్చి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల మాయమాటలు వలలో పడి కర్రీగుట్టపైకి వచ్చి ప్రాణాలు కొల్పోవద్దని, కుటుంబాలకు దూరం కావొద్దని సూచించారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనం రేపుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ పరికరాలతో బాంబులను పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..