/rtv/media/media_files/2025/01/11/I41ple4C09IdFVz71NBK.jpg)
Maoist Maccha Somaiya surrendered
Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య (62) ఎట్టకేలకు చిక్కాడు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మొత్తం సోమయ్యపై 4 కేసులతోపాటు రూ.8లక్షల రివార్డ్ ఉంది. ఇక గత 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట లొంగిపోవడం సంచలనం రేపింది.
రైతు కూలీ సంఘంలో పనిచేసి..
ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన ఎస్పీ కిరణ్.. మచ్చ సోమయ్య భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందినవాడని తెలిపారు. మావోయిస్టు పార్టీలో జిల్లా కమిటీ సెక్రటరీ, అగ్రికల్చరల్ ఇంచార్జ్‌గా వ్యవహరించినట్లు తెలిపారు. మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ గాలి ఆగయ్య అలియాస్ జనార్దన్ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీలో చేరాడని చెప్పారు. 1990లో రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్న క్రమంలో 1992లో భూపాలపల్లి పోలీసులు సోమయ్యను అరెస్టు చేసి జైలుకు పంపిచారు. అనంతరం జైలు నుంచి విడుదలై 1993లో పెద్దారెడ్డి అలియాస్ వెంకన్న నేతృత్వంలోని మహదేవ్‌పూర్ ఏరియా కమిటీలో చేరి కీలకంగా మారినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్..
సోమయ్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. మావోయిస్టు పార్టీలో 1995లో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత 1998లో మహదేవ్‌పూర్ ఏరియా కమిటీలో కూకాటి వెంకటి అలియాస్ రమేష్ అలియాస్ వికాస్ నేతృత్వంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేశాడు. 2003లో డివిజనల్ కమిటీ మెంబర్ గా పదోన్నతి పొందాడు. మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కి కార్యదర్శిగా నియమించిన తర్వాత ఉత్తర తెలంగాణలో అణచివేత కారణంగా 2007లో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 2007లోనే ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి బదిలీ అయ్యాడు.
ఇది కూడా చదవండి: DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి!