/rtv/media/media_files/2025/02/20/aGyntoDLwfqxvkPbIyBo.jpg)
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై భూపల్లిపల్లి కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హత్యకు గురయ్యారు. 2025 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన్న నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటనలో పేగులు భయటపడటంతో రాజలింగమూర్తి స్పాట్ లోనే మృతి చెందాడు.
Also Read : పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
అయితే రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్ తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటినుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందు గల రేణిగుంట కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని రేణిగుంట కుటుంబ సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నారు.
Also Read : మస్క్ చేసేది అన్యాయయే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Also Read : ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత
డీఎస్పీకి ఫిర్యాదు
స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడంతో గత 15 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల రేణిగుంట కుటుంబ సభ్యులు ఇటీవల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వారంలోగానే రాజలింగమూర్తి హత్యకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు సైతం రేణిగుంట కుటుంబ సభ్యులకు, రాజలింగమూర్తికి మధ్య జరిగిన తగాదాలే హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదేకాకుండా 171 సర్వేనెంబర్ లోని అటవీ శాఖ భూమిలో సైతం రాజలింగమూర్తి తలదూర్చాడని పలువురు కక్ష పెంచుకున్నారు. రాజలింగమూర్తి గతంలో మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్యకు వ్యతిరేకంగా కేసులు వేశాడు. అదేవిధంగా రేణిగుంట కుటుంబ సభ్యులపై సైతం భూములపై కేసులు వేయడంతో కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి.
భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచింది. కాగా బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో రాజలింగమూర్తి పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక కేసీఆర్, హరీష్ రావులతో పాటుగా మరికొంతమంది అధికారులపై మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి.
Also Read : రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా