/rtv/media/media_files/2025/02/20/vLpoa8LmQ6EPSjXtZihp.jpg)
kodada hospitel Photograph: (kodada hospitel)
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో కోదాడ పట్టణంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్ చేస్తే వైద్యం వికటించింది. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరావు (48) అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ పరిశీలించి స్కానింగ్, రక్త పరీక్షలు సూచించాడు. టెస్టులు చేయించుకొని తిరిగొచ్చే సరికి డాక్టర్ హాస్పిటల్‌లో లేడు. రిపోర్టులను ఆస్పత్రిలోని కాంపౌండర్లు మొబైల్ వాట్సాప్‌లో డాక్టర్‌కు పంపించారు. టెస్ట్ రిపోర్టులను పరిశీలించిన డాక్టర్ వాట్సప్‌లోనే పలు ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయమని సిబ్బందికి చెప్పాడు. దీంతో కాంపౌండర్లు ఇంజక్షన్ చేయడంతో అది వికటించి విరోచనాలతో నాగేశ్వరరావు మృతి చెందాడు.
Also Read: Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!
Also Read : దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!
A Man Dies With WhatsApp Treatment
కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సదరు వ్యక్తికి సీరియస్‌గా ఉందని వేరే హాస్పటల్‌కు తరలించమని బంధువులకు తెలపడంతో వారు పట్టణంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ పరిశీలించి ఏమీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నాగేశ్వరావు కుటుంబ సభ్యులు మొదటి ఆస్పత్రిలోని సిబ్బంది ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజక్షన్ వల్ల మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాగేశ్వరరావు మృతి చెందాడని.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!